వాట్సాప్‌ యూజర్లకు అలర్ట్‌

Now Register Complaint with DoT Against Offensive WhatsApp Messages  - Sakshi

వాట్సాప్‌లో వేధిస్తే.. ఉపేక్షించం - డాట్‌ కఠిన హెచ్చరికలు

అశ్లీల సందేశాలు, ఫోటోలు పంపిస్తే కేసు నమోదు

అన్ని సర్వీసు ప్రొవైడర్లకు ఆదేశాలు

సాక్షి, న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా వేదిక వాట్సాప్‌ల  వేధింపులను ఎదుర్కొంటున్న బాధితులకు ఊరట. వాట్సాప్‌లో వేధింపులపై ఫిర్యాదు చేసే అవకాశాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం (డాట్‌) అవకాశాన్ని కల్పించింది. అశ్లీల, అభ్యంతరకరమైన సందేశాలకు చెక్‌ చెప్పేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు  బాధితులు తమకు  ఫిర్యాదు చేయవచ్చని శుక్రవారం సంబంధిత అధికారి ప్రకటించారు. 

వేధింపులు, బెదిరింపులు కస్టమర్ డిక్లరేషన్‌  ఫాంలో అంగీకరించిన నిబంధనల ఉల్లంఘనకు కిందికి వస్తుందని తెలిపింది. ఇలాంటి  అవాంఛిత పద్ధతులను అనుసరిస్తున్న కస్టమర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దేశంలోని  అన్ని టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు  ఫిబ్రవరి 19న కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. 

ప్రమాదకరమైన, బెదిరింపు, అసభ్యమైన వాట్సాప్‌ సందేశాలను  అందుకున్న బాధితులు ఎవరైనా ccaddn-dot@nic.in కు  బఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని డాట్‌ కంట్రోలర్‌ ఆశిష్‌ జోషి ట్వీట్‌ చేశారు. అయితే ఇందుకు అలాంటి సందేశాల స్క్రీన్‌ షాటన్లు అంది​చాల్సి వుంటుందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును సంబంధిత టెలికాం ప్రొవైడర్లతోపాటు, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకుంటామని జోషి వెల్లడించారు. అలాగే అభ్యంతరకరమైన, అశ్లీల, అనధికారిక కంటెంట్‌ పంపిణీ అవుతున్న ప్రొవైడర్ల లైసెన్స్‌ను రద్దు చేసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. ఇటీవల జర్నలిస్టులు సహా, పలువురు ప్రముఖులకు వాట్సాప్‌ ద్వారా బెదిరింపులు, వేధింపులు ఎక్కువైన నేపథ్యంలో టెలికాం విభాగం ఈ చర్యలు చేపట్టింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top