నోకియా దూకుడు : భారీ డీల్

Nokia clinches usd 1 billion deal with Airtel - Sakshi

భారతి ఎయిర్‌టెల్‌ - నోకియా  మెగా డీల్

5జీ సేవలే లక్ష్యం

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియా దూకుడు పెంచింది. భారతదేశపు అతిపెద్ద మొబైల్ ఆపరేటర్లలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్‌ తో భారీ ఒప్పందాన్ని చేసుకుంది.1 బిలియ‌న్ డాలర్ల (రూ.7,636 కోట్లు) విలువైన ఒప్పందాన్ని ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా మంగళవారం ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ కంపెనీతో బహుళ సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ డీల్ ద్వారా దేశంలో వినియోగదారులకు నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, 5జీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

2022 వ‌ర‌కు భార‌త్‌లో 3 ల‌క్ష‌ల కొత్త మొబైల్ ట‌వ‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా నోకియా, ఎయిర్‌టెల్‌లు క‌లిసి ప‌నిచేయ‌నున్నాయని నోకియా ఒక ప్రకటనలో తెలిపింది. 4జీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంతో పాటు, 5జీ సామర్థ్యాలనుపెంచే ప్రయత్నంలో ఎయిర్‌టెల్ కు చెందిన దేశంలోని తొమ్మిది సర్కిల్‌లలో ఈడీల్ చేసుకుంది. అతిపెద్ద టెలికాం మార్కెట్లలోకనెక్టివిటీ భవిష్యత్తుకు ఇది చాలా ముఖ్యమైన ఒప్పందమని, భారతదేశంలో తన స్థానాన్ని ఇది మరింత పటిష్టం చేస్తుందని నోకియా సీఈవో రాజీవ్ సూరి అన్నారు. 1.3 బిలియన్ల జనాభాతో, ప్రపంచంలో రెండవ అతిపెద్ద టెలికాం మార్కెట్ భారతదేశంలో ఆన్‌లైన్ డిమాండ్ పెరిగేకొద్దీ రానున్న ఐదేళ్లలో మొబైల్ వినియగదారుల సంఖ్య 920 మిలియన్లకు పెరుగుతుందని నోకియా అంచనా వేస్తోంది. అంతేకాదు హువావే, ఎరిక్సన్ లాంటి కంపెనీల నుండి తీవ్రమైన పోటీ నేపథ్యంలో 5జీ మొబైల్స్ మార్కెట్లోకి ప్రవేశించే ప్రయత్నాలు విఫలమై, గత అక్టోబర్‌లో 2020 ఆదాయ అంచనాను తగ్గించిన ఆరు నెలల శిక్ష విధించిన తరువాత ఈ ఒప్పందం చేసుకోవడం విశేషం. 

మరోవైపు సీఈవో మార్పును ఇటీవల ప్రకటించింది. దీనికి ముందు ప్రకటించిన ఫలితాల్లో నోకియా 2015 తరువాత 2019 ఏడాదిలో మొదటిసారి లాభాలను నమోదు చేసింది. 7 మిలియన్ యూరోల లాభంతో అంచనాలను అధిగమించింది. కాగా 25 ఏళ్ల పాటు సేవలందించిన నోకియా ప్రెసిడెంట్, సీఈవో పదవికి భారత సంతతికి చెందిన రాజీవ్ సూరి రాజీనామా చేశారు.  ఈ ఏడాది ఆగస్ట్ 31వ తేదీతో ఆయన పదవీ కాలం ముగియనుంది. రాజీవ్ సూరి స్థానంలో పెక్కా లుండామర్క్ పేరును కంపెనీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.  (ఎకానమీని కాపాడే అత్యవసర చర్యలు కావాలి)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top