నోకియా ఫోన్‌ : 25 రోజులు స్టాండ్‌బై

Nokia 105 (2019) Feature Phone With Up to 25 Days Standby Time  - Sakshi

నోకియా 105  ‘సన్‌రైజ్‌  టు సన్‌సెట్‌’ 

ధర రూ.1190

సాక్షి, న్యూఢిల్లీ:  నోకియా 105 (2019) ఫీచర్‌ ఫోన్‌ను భారతీయ మార్కెట్లలో మంగళవారం లాంచ్‌ చేసింది. మూడు రంగుల్లో (బ్లూ, బ్లాక్‌, పింక్‌) తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ఫోన్‌ ధరను రూ.1190 గా నిర్ణయించింది.  ఈ రోజు (మంగళవారం) నుంచే అందుబాటులో ఉంది. 

నోకియా 105 ఫీచర్లు
1.77 అంగుళాల డిస్‌ప్లే
120x160 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
4ఎంబీ ర్యామ్‌, 4  ఎంబీ   స్టోరేజ్‌
3.5 ఎంఎం ఆడియో జాక్‌  
800 ఎంఏహెచ్  బ్యాటరీ

అలాగే రెగ్యులర్‌ క్లాసిక్‌  స్నేక్‌ గేమ్‌, ఎఫ్‌ఎం రేడియో ఫీచర్లను జోడించింది. ఒకసారి చార్జ్‌ చేస్తే 25 రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.  2000 కాంటాక్టులు, 500 మెసేజ్‌లను స్టోర్‌ చేసుకోవచ్చని నోకియా తెలిపింది. ‘సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు’ నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చని  కంపెనీ తెలిపింది. 14.4 గంటల టాక్ టైం, 25.8 రోజుల వరకు స్టాండ్‌బై ఈ ఫీచర్‌ ఫోన్‌ ప్రత్యేకత అని పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top