breaking news
Nokia -105
-
నోకియా ఫోన్ : 25 రోజులు స్టాండ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ: నోకియా 105 (2019) ఫీచర్ ఫోన్‌ను భారతీయ మార్కెట్లలో మంగళవారం లాంచ్ చేసింది. మూడు రంగుల్లో (బ్లూ, బ్లాక్, పింక్) తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఫోన్ ధరను రూ.1190 గా నిర్ణయించింది. ఈ రోజు (మంగళవారం) నుంచే అందుబాటులో ఉంది. నోకియా 105 ఫీచర్లు 1.77 అంగుళాల డిస్ప్లే 120x160 పిక్సెల్స్ రిజల్యూషన్ 4ఎంబీ ర్యామ్, 4 ఎంబీ స్టోరేజ్ 3.5 ఎంఎం ఆడియో జాక్ 800 ఎంఏహెచ్ బ్యాటరీ అలాగే రెగ్యులర్ క్లాసిక్ స్నేక్ గేమ్, ఎఫ్ఎం రేడియో ఫీచర్లను జోడించింది. ఒకసారి చార్జ్ చేస్తే 25 రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. 2000 కాంటాక్టులు, 500 మెసేజ్‌లను స్టోర్ చేసుకోవచ్చని నోకియా తెలిపింది. ‘సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు’ నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. 14.4 గంటల టాక్ టైం, 25.8 రోజుల వరకు స్టాండ్‌బై ఈ ఫీచర్ ఫోన్ ప్రత్యేకత అని పేర్కొంది. -
రూ.999లకే నోకియా ఫీచర్ ఫోన్
న్యూఢిల్లీ: నోకియా బ్రాండ్ అధికారాలు చేజిక్కించుకున్న ‘హెచ్ఎండీ గ్లోబల్’ తాజాగా ‘నోకియా–105’ మోడల్లో కొత్త వెర్షన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.999. ఇందులో 1.8 అంగుళాల కలర్ స్క్రీన్, ఎల్ఈడీ టార్చ్‌లైట్, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్ వంటి ప్రత్యకతలున్నాయని కంపెనీ పేర్కొంది. ఇక డ్యూయెల్ సిమ్ వెర్షన్ ఫోన్ ధర రూ.1,149గా ఉంది. ఈ రెండు ఫోన్లు బుధవారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నవి.