రూ.2వేల నోటుపై కీలక ప్రకటన

No proposal under consideration to discontinue Rs 2,000 note: Government - Sakshi

అయిదు నగరాల్లో   కొత్త రూ.10 ప్లాస్టిక్‌ నోట్లు

 రూ.500 నోట్ల సైజు 66ఎంఎంX150 ఎంఎం

రూ.2వేల  నోట్ల సైజు 66ఎంఎంX166 ఎంఎం

సాక్షి, న్యూఢిల్లీ:  డీమానిటైజేషన్‌ తరువాత  ఆర్‌బీఐ కొత్తగా  ప్రవేశపెట్టిన రూ.2000 నోటుపై  కేంద్రం మరోసారి కీలక ప్రకటన చేసింది. నల్లధనాన్ని నిరోధించే క్రమంలో రూ.500, వెయ్యినోట్లను రద్దు చేసినట్టుగానే  2వేల నోటును కూడా రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఆర్థికశాఖ లోక్‌సభలో క్లారిటీ ఇచ్చింది. రూ.2000 నోట్లను రద్దు చేసే ఉద్దేశం లేదని,  ఆర్థికశాఖ సహాయమంత్రి రాధాకృష్ణన్ లోక్‌సభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో స్పష్టతనిచ్చారు.  మరోవైపు అయిదు నగరాల్లో రూ.10 ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.

రూ.10 ప్లాస్టిక్‌ నోట్లను తీసుకొచ్చే క్రమంలో క్షేత్రస్థాయిలో కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్‌లలో ట్రయల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కాగా, ప్రస్తుతం ఉన్న రూ.500 నోట్ల సైజు 66 ఎంఎంX150 ఎంఎం ఉండగా, రూ.2000 నోట్ల సైజు 66 ఎంఎంX166 ఎంఎంగా ఉందని చెప్పారు. అలాగే రెండు కరెన్సీ నోట్ల మధ్య వ్యత్యాసాన్ని  సులభంగా గుర్తించడానికి వీలుగా  10 మి.మీ తేడా  ఉంచినట్టు తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top