పన్ను వసూళ్లలో దూకుడొద్దు | Nirmala Sitharaman Suggestion to IT Department | Sakshi
Sakshi News home page

పన్ను వసూళ్లలో దూకుడొద్దు

Aug 28 2019 8:59 AM | Updated on Aug 28 2019 8:59 AM

Nirmala Sitharaman Suggestion to IT Department - Sakshi

పుణె: పన్ను వసూళ్ల విషయంలో నిగ్రహం పాటించాలని, దూకుడుగా వ్యవహరించరాదని పన్ను అధికారులను కోరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పుణెలో మంగళవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి, కస్టమ్స్, ఆదాయపన్ను, జీఎస్టీ అధికారులు, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘వ్యాపారాలు ఉద్యోగాలను, సంపదను సృష్టిస్తాయి. కనుక పన్ను వసూలు చేయడమనే తమ ఉద్యోగ విధుల నిర్వహణ సందర్భంగా వ్యాపారులకు సహకరించడం ఎంతో అవసరం. దూకుడుగా వ్యవహరించొద్దని పన్ను అధికారులకు నా అభ్యర్థన’’ అని మంత్రి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement