హిందుజా-హిట్స్ సర్వీసులు ప్రారంభం | Next, under the brand operators, more than 500 digital TV channels | Sakshi
Sakshi News home page

హిందుజా-హిట్స్ సర్వీసులు ప్రారంభం

Sep 17 2015 1:30 AM | Updated on Sep 3 2017 9:31 AM

హిందుజా-హిట్స్ సర్వీసులు ప్రారంభం

హిందుజా-హిట్స్ సర్వీసులు ప్రారంభం

కేబుల్ టీవీ ఆపరేటర్లకు దాదాపు 500 పైచిలుకు టీవీ చానళ్లను అందుబాటులోకి తెచ్చే వినూత్నమైన హిట్స్ (హెడ్‌ఎండ్ ఇన్ ది స్కై)

నెక్ట్స్ డిజిటల్ బ్రాండ్ కింద ఆపరేటర్లకు 500 పైగా టీవీ చానల్స్
ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ

 
 న్యూఢిల్లీ : కేబుల్ టీవీ ఆపరేటర్లకు దాదాపు 500 పైచిలుకు టీవీ చానళ్లను అందుబాటులోకి తెచ్చే వినూత్నమైన హిట్స్ (హెడ్‌ఎండ్ ఇన్ ది స్కై) సర్వీసులను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఆవిష్కరించారు. కస్టమర్లకు మరిన్ని ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ టీవీ చానళ్లు దీనితో అందుబాటులోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. హిందుజా గ్రూప్‌నకు చెందిన హిట్స్ నెట్‌వర్క్.. నెక్ట్స్ డిజిటల్ బ్రాండ్ కింద మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు (ఎంఎస్‌వోలు), లోకల్ కేబుల్ ఆపరేటర్లకు (ఎల్‌సీవోలు) సర్వీసులు అందిస్తుంది.

ఈ ప్రాజెక్టులో రూ. 5,000 కోట్లపైగా పెట్టుబడులు ఉం డగలవని హిందుజా వెంచర్స్ చైర్మన్ అశోక్ హిం దుజా ఈ సందర్భంగా తెలిపారు. నెక్స్ట్ డిజి టల్ ప్లాట్‌ఫామ్‌ను పూర్తి దేశీ పరిజ్ఞానంతో రూపొం దించినట్లు ఆయన వివరించారు. కేబుల్ ఆపరేటర్లు స్వతంత్రంగా సేవలు అందించేందుకు ఇది ఉపయోగపడగలదని హిందుజా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, త్వరలో మిగతా రాష్ట్రాల్లోనూ లభిస్తాయని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement