ఎన్‌డీటీవీ షేర్లకు సీబీఐ షాక్! | NDTV shares shed 7%; hit one-year low on CBI searches | Sakshi
Sakshi News home page

ఎన్‌డీటీవీ షేర్లకు సీబీఐ షాక్!

Jun 5 2017 2:55 PM | Updated on Sep 5 2017 12:53 PM

ఎన్‌డీటీవీ షేర్లకు సీబీఐ షాక్!

ఎన్‌డీటీవీ షేర్లకు సీబీఐ షాక్!

సీబీఐ అనూహ్య దాడుల నేపథ్యంలో ఎన్‌డీటీవీ షేర్లు ఇవాల్టి మార్కెట్లో కుప్పకూలిపోయాయి.

 ముంబై: సీబీఐ  అనూహ్య దాడుల నేపథ్యంలో  ఎన్‌డీటీవీ  షేర్లు  ఇవాల్టి మార్కెట్లో కుప్పకూలిపోయాయి.   ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టం కలిగించారన్న ఆరోపణలతో సీబీఐ  సోదాల వార్తల కారణంగా ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి.  ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్, ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్, ప్రణయ్ రాయ్) అనే ప్రైవేటు కంపెనీలపై సీబీఐ దాడుల వార్తలతో  ఆందోళకు గురైన ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు దిగారు.  దీంతో ఈ షేరు దాదాపు 7 శాతానికి బాగా నష్టపోయింది. భారీ నష్టాలతో దీంతో  52 వారాల కనిష్ట స్థాయికి చేరింది.  రాయ్‌, రాయ్‌ భార్య రాధిక, ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ తదితరాల వల్ల ఈ నష్టం వాటిల్లిందన్న ఆరోపణలపై సీబీఐ కేసులు నమోదు చేసింది.

ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టం కలిగించారంటూ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్, ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్, ప్రణయ్ రాయ్) అనే ప్రైవేటు కంపెనీ, మరికొందరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అనంతరం ఈ రోజు ఢిల్లీలోని గ్రేటల్ కైలాష్-1 ప్రాంతంలో ఉన్న రాయ్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలకు దిగారు. మరో నాలుగు ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించారు.  మరోవైపు ఈ దాడులను ఎన్‌డీటీవీ తీవ్రంగా ఖండించగా,   వివిధ పత్రికాధిపతులు తీవ్ర  దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

 కాగా బ్యాంకును మోసం చేసిన కేసుల్లో భాగంగానే ఈ సోదాలు చేపట్టినట్టు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. విదేశీ యూనిట్ల ద్వారా భారీ స్థాయిలో నిధులు తరలింపునకు సహకరించడం ద్వారా ఎన్డీటీవీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2015 నవంబర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 2,030 కోట్లకు నోటీసు జారీ చేసింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement