breaking news
one-year low
-
ఏడాది కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
సాక్షి,ముంబై: నవంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచి (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి దిగి వచ్చింది. బుధవారం వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2.33 శాతంగా నమోదైంది. అక్టోబర్ నెలలో ఇది 3.31 శాతంగా ఉంది. వరుసగా గత నాలుగు నెలలుగా దిగి వస్తున్న రీటైల్ ద్రవ్యోల్బణం తాజాగా దీంతో 2017 జులై నాటి స్థాయిని నమోదు చేసింది. మరోవైపు పారిశ్రామికవృద్ధి రేటు రెండింతలైంది. ఇది ఆర్థికవ్యవస్థకు డబుల్ బొనాంజా అని విశ్లేషకులు పేర్కొన్నారు. పారిశ్రామిక వృద్ధి రేటు అక్టోబర్ నెలలో 8.1 శాతం పెరిగింది.ఇది ఏడాది గరిష్టం. సిఎస్ఓ డేటా ప్రకారం కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ 2.61 శాతంతో పోలిస్తే.. తాజాగా 0.86 శాతంగా ఉంది. గత నెలలో 7.39 శాతంతో పోలిస్తే ఇంధనం ద్రవ్యోల్బణం 8.55 శాతంగా నమోదైంది. దుస్తులు, పాదరక్షల ద్రవ్యోల్బణం అక్టోబరు 3.55 శాతంతో పోలిస్తే 3.53 శాతం వద్ద ఉంది. హౌసింగ్ ద్రవ్యోల్బణం నవంబరు 5.99గా నమోదుకాగా అంతకుముందు నెలలో ఇది 6.55 శాతంగా ఉంది. -
ఎన్డీటీవీ షేర్లకు సీబీఐ షాక్!
ముంబై: సీబీఐ అనూహ్య దాడుల నేపథ్యంలో ఎన్డీటీవీ షేర్లు ఇవాల్టి మార్కెట్లో కుప్పకూలిపోయాయి. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టం కలిగించారన్న ఆరోపణలతో సీబీఐ సోదాల వార్తల కారణంగా ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్, ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్, ప్రణయ్ రాయ్) అనే ప్రైవేటు కంపెనీలపై సీబీఐ దాడుల వార్తలతో ఆందోళకు గురైన ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు దిగారు. దీంతో ఈ షేరు దాదాపు 7 శాతానికి బాగా నష్టపోయింది. భారీ నష్టాలతో దీంతో 52 వారాల కనిష్ట స్థాయికి చేరింది. రాయ్, రాయ్ భార్య రాధిక, ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ తదితరాల వల్ల ఈ నష్టం వాటిల్లిందన్న ఆరోపణలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టం కలిగించారంటూ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్, ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్, ప్రణయ్ రాయ్) అనే ప్రైవేటు కంపెనీ, మరికొందరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అనంతరం ఈ రోజు ఢిల్లీలోని గ్రేటల్ కైలాష్-1 ప్రాంతంలో ఉన్న రాయ్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలకు దిగారు. మరో నాలుగు ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించారు. మరోవైపు ఈ దాడులను ఎన్డీటీవీ తీవ్రంగా ఖండించగా, వివిధ పత్రికాధిపతులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాగా బ్యాంకును మోసం చేసిన కేసుల్లో భాగంగానే ఈ సోదాలు చేపట్టినట్టు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. విదేశీ యూనిట్ల ద్వారా భారీ స్థాయిలో నిధులు తరలింపునకు సహకరించడం ద్వారా ఎన్డీటీవీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2015 నవంబర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 2,030 కోట్లకు నోటీసు జారీ చేసింది.