జాతీయ పెన్షన్‌ పథకం: ఒక ఊరట | National Pension Scheme: Age limit raised to 65 years | Sakshi
Sakshi News home page

జాతీయ పెన్షన్‌ పథకం: ఒక ఊరట

Sep 12 2017 8:49 AM | Updated on Mar 28 2019 6:33 PM

జాతీయ పెన్షన్‌ పథకం: ఒక ఊరట - Sakshi

జాతీయ పెన్షన్‌ పథకం: ఒక ఊరట

నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పి ఎస్) లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. జాతీయ పెన్షన్ పథకానికి సంబంధించి వయో పరిమితి 65సంవత్సరాలకు పెంచింది.

సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పి ఎస్) లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం  ఊరటనిచ్చింది. జాతీయ పెన్షన్ పథకానికి సంబంధించి వయో పరిమితి 65 సంవత్సరాలకు  పెంచింది. ఈ మేరకు  పెన్షన్‌ రెగ్యులేటరీ  బోర్డు ఆమోదించిందనీ  పిఎఫ్ఆర్‌డీఏ  సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది.  ఇప్పటివరకు ఇది 60 ఏళ్లుగా ఉంది.

నేషనల్ పెన్షన్ పథకం (ఎన్‌పీఎస్) లో చేరిన ఉన్నత వయస్సు పరిమితి ప్రస్తుత 60 ఏళ్లకు 65 ఏళ్లుగా పెంచిందని సోమవారం ప్రకటించింది. పెన్షన్ రెగ్యులేటర్ బోర్డు ఇప్పటికే  సవరణను ఆమోదించిందని   పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్‌డీఏ) ఛైర్మన్‌  హేమంత్‌  కాంట్రాక్టర్‌ ప్రకటించారు. దీనిపై  త్వరలోనే నోటిఫై చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 18-60 మధ్య వయసు పరిమితిని తాజా సవరణ ప్రకారం గరిష్టంగా 65 సం.రాలుగా ఉంటుందని పేర్కొన్నారు.  ప్రపంచంలో ఇదే లో-కాస్ట్‌  పెన్షన్  పథకమని చెప్పారు.
తాజా సవరణ ద్వారా  వేలాదిమందికి లాభం క‌లిగే అవ‌కాశం ఉందని తెలిపారు. అలాగే వ‌య‌సు చెల్లిన నిధుల‌ను స‌క్ర‌మంగా వినియోగించ‌డంతో పాటు వినియోగ‌దారుల‌కు అన్ని ర‌కాల సౌక‌ర్యాల‌ను సుల‌భంగా అందించేందుకు పీఎఫ్ఆర్డీఏ కృషి చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. అవ్య‌వ‌స్థీకృత రంగంలో ప‌నిచేస్తున్న 85 శాతం మంది ఉద్యోగుల‌కు కూడా పెన్ష‌న్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హేమంత్‌   వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement