ఎన్‌పీఎస్‌లో కొత్తగా 12 లక్షల మంది | NPS seen significant growth with over 12 lakh new private sector subscribers | Sakshi
Sakshi News home page

ఎన్‌పీఎస్‌లో కొత్తగా 12 లక్షల మంది

May 4 2025 12:56 PM | Updated on May 4 2025 1:25 PM

NPS seen significant growth with over 12 lakh new private sector subscribers

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌లో (ఎన్‌పీఎస్‌) గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) కొత్తగా 12 లక్షల మంది ప్రైవేటు రంగం నుంచి సభ్యులుగా చేరారు. దీంతో మొత్తం ప్రైవేటు రంగ సభ్యులు 2025 మార్చి నాటికి 165 లక్షలకు చేరారు. చిన్నారుల పేరిట ప్రారంభించేందుకు ఉద్దేశించిన ఎన్‌పీఎస్‌ వాత్సల్య పథకం గేతడాది సెప్టెంబర్‌ నుంచి అందుబాటులోకి రాగా, ఇందులో సభ్యులు లక్ష దాటారు.

ఇదీ చదవండి: ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీ

ఈ వివరాలను పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌ఏడీఏ) వెల్లడించింది. పీఎఫ్‌ఆర్‌డీఏ పర్యవేక్షణలోని ఎన్‌పీఎస్, అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) నిర్వహణలోని ఆస్తులు 2024–25లో 23 శాతం పెరిగి రూ.14.43 లక్షల కోట్లకు చేరాయి. 2025 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిక్స్‌డ్‌ పెన్షన్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement