మోటో జీ5ఎస్‌ ధర తగ్గింది.. పరిమిత కాలమే | Moto G5S gets a temporary price cut of Rs 5,000, now available for Rs 9,999 | Sakshi
Sakshi News home page

మోటో జీ5ఎస్‌ ధర తగ్గింది.. పరిమిత కాలమే

Apr 9 2018 3:32 PM | Updated on Jul 6 2019 3:18 PM

Moto G5S gets a temporary price cut of Rs 5,000, now available for Rs 9,999 - Sakshi

సాక్షి, ముంబై: మోటోరోలా వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్‌ ఆఫర్‌ను ప్రకటించింది. జీ5ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరను 5వేల రూపాయల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 45వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్‌ సేల్‌లో  మోటో జీ5ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపు ధరను  మోటోరోలా ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. గతేడాది ఆగస్టులో లాంచ్‌ అయినప్పుడు రూ.14,999గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర, ధర తగ్గింపు అనంతరం ప్రస్తుతం రూ.9,999కే అందుబాటులోకి వచ్చింది.

అయితే అమెజాన్‌ ఇండియాలో ప్రత్యేకంగా ఈ తగ్గింపు  పరిమిత కాలానికి అంటే... ఈ నెల 11 వరకే అందుబాటులో ఉండనుంది. ఇక​ మోటో జీ5ఎస్‌ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే 4జీబీ ర్యామ్‌, 16ఎంపీ రియర్‌ కెమెరా, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ప్రధానంగా ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement