
సాక్షి, న్యూఢిల్లీ: వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) స్కాంలో నిందితుడు, డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఉద్దేక పూర్వక రుణ ఎగవేసిన ఆర్థిక నేరస్తుడు, తప్పించుకుని పారిపోయినాడు ఉద్దేశ పూర్వక ఎగవేతదారుడు అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం బాంబే హైకోర్టుకు తెలిపింది.
ఈ క్రమంలో చోక్సీ దాఖలు చేసిన రెండు పిటిషన్లను తిరస్కరించాల్సిందిగా ఈడీ కోరింది. ఈ మేరకు ఈడీ రెండు పిటిషన్లను దాఖలు చేసింది. ఒకటి ఫ్యుజిటివ్ ఆర్థికనేరస్తుడిగా చోక్సీని ప్రకటించాలని, రెండవది అతనిని ప్రశ్నించేందుకు అనుమతినివ్వాలని కోరింది. అలాగే నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ కోర్టుముందు హాజరు కాకుండా ఉద్దేశ పూర్వకంగా తప్పించుకు తిరుగుతున్నాడంటూ జస్టిస్ ఐఎ మహంతి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమవారం సమర్పించిన అఫిడవిట్‌లో ఈడీ ఆరోపించింది. విచారణకు సహకరించే ఉద్దేశం అతనికి లేదని మండిపడింది. దీనిపై తదుపరి విచారణను మంగళవారం చేపట్టనుంది బాంబే హైకోర్టు .