ఏటా మూడు కొత్త నగరాలకు మెక్ డొనాల్డ్స్ | McDonald's three new cities each year | Sakshi
Sakshi News home page

ఏటా మూడు కొత్త నగరాలకు మెక్ డొనాల్డ్స్

Feb 11 2016 12:50 AM | Updated on Dec 27 2018 4:17 PM

ఏటా మూడు కొత్త నగరాలకు మెక్ డొనాల్డ్స్ - Sakshi

ఏటా మూడు కొత్త నగరాలకు మెక్ డొనాల్డ్స్

దక్షిణ, పశ్చిమ భారత్‌లో మెక్ డొనాల్డ్స్ ఔట్‌లెట్లను నిర్వహిస్తున్న హార్డ్‌క్యాజిల్ రెస్టారెంట్స్ ఏటా మూడు కొత్త నగరాల్లో అడుగు పెడుతోంది.

వెస్ట్‌లైఫ్ డెవలప్‌మెంట్ వైస్ చైర్మన్ అమిత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్షిణ, పశ్చిమ భారత్‌లో మెక్ డొనాల్డ్స్ ఔట్‌లెట్లను నిర్వహిస్తున్న హార్డ్‌క్యాజిల్ రెస్టారెంట్స్ ఏటా మూడు కొత్త నగరాల్లో అడుగు పెడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌తోసహా 29 నగరాలకుగాను 223 స్టోర్లను కంపెనీ నిర్వహిస్తోంది. ఏటా 30-50 ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలన్నది కంపెనీ ప్రణాళిక. ఒక్కో స్టోర్‌కు సుమారు రూ.3 కోట్లు వెచ్చిస్తోంది.

 2017లో ఆంధ్రప్రదేశ్‌లో స్టోర్లను తెరుస్తామని హార్డ్‌క్యాజిల్ రెస్టారెంట్స్‌ను ప్రమోట్ చేస్తున్న వెస్ట్‌లైఫ్ డెవలప్‌మెంట్ వైస్ చైర్మన్ అమిత్ జతియా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. దక్షిణ, పశ్చిమ భారత్‌లో 62 మెక్ కేఫ్ స్టోర్లను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాదే హైదరాబాద్‌లో మెక్ కేఫ్ తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.

మెక్ డెలివరీ సర్వీసుల్లో 50 శాతం ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లు వస్తున్నాయని హార్డ్‌క్యాజిల్ రెస్టారెంట్స్ ఎండీ స్మిత జతియా తెలిపారు. 2014-15లో కంపెనీ రూ.760 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత 2015-16ఆర్థిక సంవత్సరంలో రూ.850 కోట్ల టర్నోవర్‌ను ఆశిస్తోంది. పాశ్చాత్య ఫాస్ట్ ఫుడ్ వ్యాపార పరిమాణం భారత్‌లో సుమారు రూ.6,500 కోట్లుంది. పదేళ్లలో ఇది 3-5 రెట్లు పెరుగుతుందని వెస్ట్‌లైఫ్ డెవలప్‌మెంట్  అంచనా వేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement