టయోటా ‘స్పెషల్’ ఎతియోస్ | Limited edition variants of Toyota Etios Sedan hit the road | Sakshi
Sakshi News home page

టయోటా ‘స్పెషల్’ ఎతియోస్

Jul 4 2014 12:42 AM | Updated on Sep 2 2017 9:46 AM

టయోటా ‘స్పెషల్’ ఎతియోస్

టయోటా ‘స్పెషల్’ ఎతియోస్

టయోటా కంపెనీ మిడ్-సైజ్ సెడాన్ మోడల్, ఎతియోస్‌లో స్పెషల్ ఎడిషన్, ఎతియోస్ ఎక్స్‌క్లూజివ్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది.

పెట్రోల్ కారు @ రూ.5.98 లక్షలు
  డీజిల్ కారు @ రూ.7.10 లక్షలు

న్యూఢిల్లీ: టయోటా కంపెనీ మిడ్-సైజ్ సెడాన్ మోడల్, ఎతియోస్‌లో స్పెషల్ ఎడిషన్, ఎతియోస్ ఎక్స్‌క్లూజివ్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎతియోస్ ఎక్స్‌క్లూజివ్ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యమని టయోటా కిర్లోస్కర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్)ఎన్. రాజా చెప్పారు, 900 కార్లను మాత్రమే అందుబాటులోకి తెస్తున్నామని  పేర్కొన్నారు. పెట్రోల్ వేరియంట్ ధర రూ.5.98 లక్షలు, డీజిల్ వేరియంట్ రూ.7.10 లక్షలు (ఈ రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని వివరించారు.

 బుకింగ్స్ గురువారం నుంచి ప్రారంభించామని, ఈ నెల 11 నుంచి కార్లను డెలివరీ చేస్తామని చెప్పారు. మారుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎతియోస్ ఎక్స్‌క్లూజివ్‌ను రూపాందించామని వివరించారు. భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన ఎతియోస్ మోడల్‌ను 2010లో మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటివరకూ 2 లక్షల కార్లను విక్రయించామని పేర్కొన్నారు. ఈ కారును కుడి చేతి డ్రైవింగ్ మార్కెట్లైన దక్షిణాఫ్రికా, శ్రీలంక, మారిషస్, జింబాబ్వే, సీషెల్స్, నేపాల్, భూటాన్, బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో కూడా విక్రయిస్తున్నామని  ఆయన ఈ సందర్భంగా వివరించారు.

 100 శాతం ఫైనాన్స్...
 టయోటా ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండానే ఏడేళ్ల కాలానికి వంద శాతం కారు రుణం అందిస్తున్నామని కంపెనీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement