బీమా సంస్థల కొత్త ప్రీమియం ఆదాయంలో 47% వృద్ధి

బీమా సంస్థల కొత్త ప్రీమియం ఆదాయంలో 47% వృద్ధి


న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం 24 జీవిత బీమా కంపెనీల కొత్త ప్రీమియం ఆదాయంలో జూలై నెలలో 47.4 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇది రూ.20,428 కోట్లకు చేరింది. కాగా గతేడాది ఇదే కాలంలో సంస్థల కొత్త ప్రీమియం ఆదాయం రూ.13,854 కోట్లుగా ఉంది. ఐఆర్‌డీఏ తాజా గణాంకాల ప్రకారం.. ఒకే ఒక ప్రభుత్వ రంగ ఎల్‌ఐసీ ప్రీమియం ఆదాయం 51 శాతం వృద్ధితో రూ.10,738 కోట్ల నుంచి రూ.16,255 కోట్లకు పెరిగింది.



ఇక మిగిలిన 23 ప్రైవేట్‌ సంస్థల ప్రీమియం ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.3,117 కోట్ల నుంచి రూ.4,173 కోట్లకు ఎగసింది. ఎస్‌బీఐ లైఫ్‌ ప్రీమియం ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.848 కోట్లకు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ప్రీమియం ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.759 కోట్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ప్రీమియం ఆదాయంలో 69 శాతం వృద్ధి చెందింది. ఇది రూ.521 కోట్ల నుంచి రూ.880 కోట్లకు పెరిగింది. బిర్లా సన్‌ లైఫ్‌ ప్రీమియం ఆదాయం 57 శాతం వృద్ధితో రూ.196 కోట్లకు, కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓబీసీ లైఫ్‌ ప్రీమియం ఆదాయం 75 శాతం వృద్ధితో రూ.100 కోట్లకు చేరింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top