లావా..  జెడ్‌60ఎస్‌

Lava Launches Z60s At Rs 4,949 With Free One-Time Screen Replacement - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ తయారీ కంపెనీ లావా తాజాగా జెడ్‌60ఎస్‌ మోడల్‌ను విడుదల చేసింది. 2.5డీ కర్వ్‌తో 5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లే, ఆన్‌డ్రాయిడ్‌ 8.1 ఓరియో, 1.5 గిగాహెట్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, ఇరువైపులా 5 ఎంపీ కెమెరా, 2,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లతో రూపొందించారు. ఫోన్‌ 8.5 మిల్లీమీటర్ల మందం ఉంది. ఫొటోల్లో స్పష్టత కోసం కెమెరాకు షార్ప్‌ క్లిక్‌ టెక్నాలజీని వాడారు.

మోడల్‌ ధర రూ.4,949గా నిర్ణయించారు. నవంబర్‌ 15లోగా ఈ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొంటే వన్‌ టైమ్‌ ఫ్రీ స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. జెడ్‌60 సక్సెస్‌ కావడంతో జెడ్‌60ఎస్‌కు రూపకల్పన చేశామని లావా ఇంటర్నేషనల్‌ ప్రొడక్ట్‌ హెడ్‌ గౌరవ్‌ నిగమ్‌ ఈ సందర్భంగా తెలిపారు.   
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top