స్టాక్స్లో ఈపీఎఫ్వో పెట్టుబడులు రూ.9,723 కోట్లు | Last date for EPFO pensioners to submit life certificates is January 15 | Sakshi
Sakshi News home page

స్టాక్స్లో ఈపీఎఫ్వో పెట్టుబడులు రూ.9,723 కోట్లు

Nov 29 2016 1:07 AM | Updated on Sep 4 2017 9:21 PM

స్టాక్స్లో ఈపీఎఫ్వో పెట్టుబడులు రూ.9,723 కోట్లు

స్టాక్స్లో ఈపీఎఫ్వో పెట్టుబడులు రూ.9,723 కోట్లు

ఈ ఏడాది అక్టోబర్ వరకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లలో రూ.9,723 కోట్లను పెట్టుబడిగా పెట్టింది.

న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్ వరకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లలో రూ.9,723 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. వీటిపై రాబడి 9.17 శాతంగా ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం లోక్‌సభకు లిఖిత పూర్వకంగా తెలిపారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకుల నేపథ్యంలో ఆ ప్రభావం నుంచి తట్టుకునేందుకు నిఫ్టీ, సెన్సెక్స్ ఈటీఎఫ్‌లలో ఈ మేరకు పెట్టుబడి పెట్టినట్టు పేర్కొన్నారు.

ఈపీఎఫ్‌వో వద్ద ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం రూ.7.49 లక్షల కోట్ల నిధులు ఉన్నట్టు వెల్లడించారు. ఈటీఎఫ్‌లలో రాబడులు ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల కంటే ఎక్కువగా ఉన్నాయని, ఇది చందాదారులకు లాభదాయకమన్నారు. ఈపీఎఫ్‌వో గతేడాది ఆగస్ట్ నుంచి ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement