
ముంబై: లాభాలు వచ్చినప్పుడు జేబులో వేసుకునే ప్రైవేటు సంస్థలు ..నష్టాలు వచ్చినప్పుడు సమాజంలో అందరికీ పులిమే ప్రయత్నాలు మానుకోవాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ హితవు పలికారు. అలాగే కష్టకాలంలో ప్యాకేజీలు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరడం సరికాదని ఆయన చెప్పారు. ఈ విషయంలో ప్రైవేట్ సంస్థల ’మైండ్‌సెట్’ మారాలని చెప్పారు. ఎకానమీ వృద్ధి చెందడానికి వినియోగం కన్నా పెట్టుబడులే ఎక్కువగా దోహదపడతాయన్నారు.