కీ హైట్స్‌ ఇన్‌ఫ్రా నూతన లోగో ఆవిష్కరణ | Key Heights Infra new logo innovation | Sakshi
Sakshi News home page

కీ హైట్స్‌ ఇన్‌ఫ్రా నూతన లోగో ఆవిష్కరణ

Jul 16 2018 2:07 AM | Updated on Jul 16 2018 2:07 AM

Key Heights Infra new logo innovation - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇంటీరియర్‌ డిజైన్‌ కంపెనీ కీ హైట్స్‌ ఇన్‌ఫ్రా నూతన లోగోను ఆవిష్కరించింది. అనంతరం అడ్వర్టయిజ్‌మెంట్‌ ఏజెన్సీ రీసెర్చ్‌ మీడియాతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. శనివారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో కీ హైట్స్‌ ఇన్‌ఫ్రా ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ వంగా శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ... 15 ఏళ్లుగా కీ హైట్స్‌ పేరిట సేవలందిస్తున్నామని, తెలుగు రాష్ట్రాల్లో వందల గృహాలు, బహుళ అంతస్తులు, కార్పొరేట్‌ ఆఫీసు, వాణిజ్య సముదాయాలకు ఆర్కిటెక్చర్, ఇంటీరియర్‌ డిజైన్స్‌ అందించామన్నారు.

ఇటీవలి కృష్ణా పుష్కరాలు, హైదరాబాద్‌ మెట్రో, తిరుపతిలోని దైవలోక్‌ మైథలాజికల్‌ థీమ్‌ పార్క్‌లకు విజువల్‌ కాన్సెప్ట్‌లను అందించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రీసెర్చ్‌ మీడియా గ్రూప్‌ సీఈఓ సీహెచ్‌ హరిలీలా ప్రసాద్, చైర్మన్‌ జే చైతన్య, క్రియేటివ్‌ హెడ్‌ లోహిత్‌ కుమార్, సాల్మన్‌ షానీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement