కార్బన్ నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ | Karbonn Quattro L52, Titanium Mach Six Launched With VR Headsets in India | Sakshi
Sakshi News home page

కార్బన్ నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్

Apr 12 2016 4:42 PM | Updated on Sep 3 2017 9:42 PM

కార్బన్ నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్

కార్బన్ నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్

దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ కార్బన్ తాజాగా ‘క్వాట్రో ఎల్52’, ‘టైటానియం మాక్ 6’ అనే రెండు వినూత్నమైన స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చే సింది.

న్యూఢిల్లీ: దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ కార్బన్ తాజాగా ‘క్వాట్రో ఎల్52’, ‘టైటానియం మాక్ 6’ అనే రెండు వినూత్నమైన స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చే సింది. వీటి ధరలు వరుసగా రూ.8,790గా, రూ.7,490. కంపెనీ ఈ రెండు స్మార్ట్‌ఫోన్లకు వీఆర్ హెడ్‌సెట్స్ (వీఆర్ గ్లాసెస్)ను ఉచితంగా అందిస్తోంది. దీంతో కార్బన్ కూడా వీఆర్ విభాగంలోకి ప్రవేశించినట్లయ్యింది. కాగా, ఇతర మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలతో పోటీపడుతూ కార్బన్ కూడా ‘వర్చ్యువల్ రియాలిటీ’ హెడ్‌సెట్స్ విభాగంలోకి అడుగుపెట్టింది.

‘క్వాట్రో ఎల్52’: ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల తెర, 4జీ, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,250 ఎంఏహెచ్ బ్యాటరీ, వీఆర్ యాప్స్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది.

‘టైటానియం మాక్ 6’: 5.1 లాలీపాప్ ఓఎస్, 6 అంగుళాల తెర, 2 జీబీ ర్యామ్, 3జీ, 16 జీబీ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 3 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement