జెట్‌ ఎయిర్‌వేస్‌లో డెల్టాకు వాటాల విక్రయం! | Jet Airways shares jump on reports of stake sale to Delta Air Lines | Sakshi
Sakshi News home page

జెట్‌ ఎయిర్‌వేస్‌లో డెల్టాకు వాటాల విక్రయం!

Jul 4 2017 12:30 AM | Updated on Sep 5 2017 3:06 PM

జెట్‌ ఎయిర్‌వేస్‌లో డెల్టాకు వాటాల విక్రయం!

జెట్‌ ఎయిర్‌వేస్‌లో డెల్టాకు వాటాల విక్రయం!

విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ .. అమెరికాకు చెందిన ఎయిర్‌లైన్స్‌ కంపెనీ డెల్టాకు 24 శాతం దాకా వాటాలు విక్రయించనున్నట్లు సమాచారం.

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ .. అమెరికాకు చెందిన ఎయిర్‌లైన్స్‌ కంపెనీ డెల్టాకు 24 శాతం దాకా వాటాలు విక్రయించనున్నట్లు సమాచారం. కొత్తగా షేర్ల జారీ ద్వారా ఈ డీల్‌ ఉండగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాటాల విక్రయం ద్వారా జెట్‌ ఎయిర్‌వేస్‌ సుమారు రూ. 2,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోన్నట్లు తెలుస్తోంది.

ఈ ఒప్పందం సాకారం కావాలంటే ఎతిహాద్‌ నుంచి కుడా జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆమోదముద్ర పొందాల్సి ఉంటుంది. డీల్‌ పూర్తయితే ఎతిహాద్‌ తన 24 శాతం వాటాను స్థిరంగా కొనసాగించుకునేందుకు మరిన్ని నిధులు సమకూర్చాల్సి ఉండనుండటమే ఇందుకు కారణం. వాటా విక్రయం వార్తల నేపథ్యంలో సోమవారం బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ సుమారు షేరు 3 శాతం పెరిగి దాదాపు రూ. 583 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement