బీవోఐ ద్వారా ఐటీ రిటర్నులు | IT returns by BOI | Sakshi
Sakshi News home page

బీవోఐ ద్వారా ఐటీ రిటర్నులు

May 25 2015 1:58 AM | Updated on Sep 27 2018 3:54 PM

బీవోఐ ద్వారా ఐటీ రిటర్నులు - Sakshi

బీవోఐ ద్వారా ఐటీ రిటర్నులు

ఖాతాదారులు ఆన్‌లైన్ ద్వారా ఐటీ రిటర్నులు దాఖలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) కల్పిస్తోంది.

ఖాతాదారులు ఆన్‌లైన్ ద్వారా ఐటీ రిటర్నులు దాఖలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) కల్పిస్తోంది. ఇందుకోసం ‘మై ఐటీ రిటర్న్ డాట్ కామ్’ అనే సంస్థతో ఈ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎటువంటి రుసుములు చెల్లించనవసరం లేకుండా ఉద్యోగులు, ఖాతాదారులు ఈ వెబ్‌సైట్ ద్వారా రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని బీవోఐ జీఎం ఎస్‌ఆర్ మీనా తెలిపారు. ఈ వెబ్‌సైట్ ద్వారా ట్యాక్స్ కాలిక్యులేషన్, ట్యాక్స్ స్టేటస్, రిటర్నులు వంటి సేవలు పొందవచ్చు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా మొబైల్ ఫోన్ ద్వారా కూడా రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement