ఆధార్‌తో లింకు కాకుంటే పాన్‌ కట్‌

IT Department Deadline For PAN Link With Aadhar - Sakshi

మార్చి 31 వరకు గడువు

న్యూఢిల్లీ: శాశ్వత ఖాతా నెంబరు (పాన్‌) విషయంలో ఆదాయ పన్ను శాఖ తుది హెచ్చరికను జారీ చేసింది. ఆధార్‌ నెంబర్‌తో పాన్‌ కార్డు అనుసంధానం తప్పదని ఇప్పటికే పలు సార్లు సూచించి, గడువు తేదీలను పొడగిస్తూ వచ్చిన ఐటీ శాఖ.. లింక్‌ కాని పాన్‌ కార్డులను పనిచేయకుండా (ఇన్‌ ఆపరేటివ్‌) చేయనున్నామని శుక్రవారం ప్రకటించింది. ఇందుకు మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 139ఏఏ సబ్‌ సెక్షన్‌ (2) ప్రకారం.. 2017 జూలై ఒకటి వరకు జారీ చేసిన పాన్‌ కార్డులకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరని, పేర్కొన్న గడువు తేదీ లోపు లింక్‌ చేయకుంటే ఇన్‌ఆపరేటివ్‌ చేసేందుకు ఇన్‌కం ట్యాక్స్‌ రూల్స్‌లో 114ఏఏఏ చేర్చినట్లు ప్రకటించింది. జనవరి 27 నాటికి 30.75 కోట్ల పాన్‌లకు ఆధా ర్‌ అనుసంధానం జరగ్గా, ఇప్పటికీ 17.58 కోట్ల పాన్‌ కార్డులు లింక్‌ కాలేదని వెల్లడించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top