ఇన్‌స్టాగ్రామ్‌లో ​ కొత్త ఫీచర్‌

Instagram Moves Into e-commerce with Shopping Button - Sakshi

 కొత్త ఫీచర్‌ ‘షాపింగ్‌ బటన్‌’ తో  ఈ కామర్స్‌ బిజినెస్‌లోకి

"చెక్అవుట్" ఆప్షన్‌ ద్వారా  ఉత్పత్తుల ఎంపిక 

శాన్‌ఫ్రాన్సిస్కో:  ఫేస్‌బుక్‌ సొంతమైన ఇన్‌స్టాగ్రామ్‌  ఈ కామర్స్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.   అత్యంత ప్రజాదారణ పొందన ఈ కామర్స్‌  వ్యాపారం ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవాలని  చూస్తోంది. ఎంచుకున్న బ్రాండ్ల  ఉత్పత్తులు కొనుగోలు చేసుకునే ఒక   షాపింగ్‌  ఫీచర్‌ను జోడించింది. ఈమేరకు  సంస్థ మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది.  

 బీటా వెర్షన్లో "చెక్అవుట్" బటన్ అమెరికాలో లాంచ్‌ చేశామని  ఫేస్‌బుక్‌ వెల్లడించింది. త ద్వారా  మీరు ఇష్టపడే ఉత్పత్తిని యాప్‌ ద్వారానే  కొనుగోలు చేయవచ్చని  తెలిపింది. చెక్అవుట్ బటన్‌ను క్లిక్‌  చేసి, సైజ్‌, రంగు ఆప్షన్స్‌ ఎంచుకుని, చెల్లింపులు చేయవచ్చని పేర్కొంది.  ముఖ్యంగా  ఆడిడాస్, బుర్బెర్రీ, డియోర్, హెచ్‌ అండ్‌ ఎం,  నైక్, ఆస్కార్ డి లా రెంటా, ప్రాడా, గ్లాసెస్ రీటైలర్ వార్బీ పార్కర్  లాంటి  పరిమిత బ్రాండ్ల ఉత్పత్తులను తమ ప్లాట్‌ఫాంలో జోడించినట్టు తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top