ఫోర్బ్స్‌ జాబితాలో 12 ఉత్తమ భారత కంపెనీలు

Infosys, TCS and Tata Motors in Forbes' global best companies list - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 250 ఉత్తమ కంపెనీల జాబితాను ఫోర్బ్స్‌ రూపొందించగా.. 12 భారత కంపెనీలు ఇందులో స్థానం సంపాదించుకున్నాయి. 2018 ఏడాదికి రూపొందించిన ఈ జాబితాలో ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ 31 వ స్థానంలో నిలిచింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (35), టాటా మోటార్స్‌ (70), టాటా స్టీల్‌ (131), ఎల్‌ అండ్‌ టీ (135), గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ (154), జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (156), మహీంద్ర అండ్‌ మహీంద్రా (164), ఏషియన్‌ పెయింట్స్‌ (203), స్టీల్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా (227), ఐటిసి (239) స్థానాల్లో నిలిచాయి. మొదటి స్థానంలో అమెరికాకు చెందిన వాల్ట్‌ డిస్నీ నిలిచింది. ఈ జాబితాలో 61 అమెరికన్‌ కంపెనీలు స్థానం సంపాదించుకున్నాయి. ఆ తరువాత స్థానంలో 32 కంపెనీలతో జపాన్‌ చోటుదక్కించుకుంది. ఫోర్బ్స్‌ జాబితాలో 19 చైనా కంపెనీలు, 13 ఫ్రాన్స్, 11 జర్మనీ కంపెనీలు ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top