మళ్లీ పడిపోయిన జీడీపీ వృద్ధి రేటు


సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో దిగజారిన వృద్ధి రేటు, కొత్త పన్ను విధానం జీఎస్టీతో మరింత కిందకి పడిపోయింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు మూడేళ్ల కనిష్టంలో 5.7 శాతంగా నమోదైంది. కేంద్ర గణాంకాల అధికారి నేడు(గురువారం) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం తెలిసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.9 శాతంగా ఉంది. డీమానిటైజేషన్‌ ప్రభావంతో గత త్రైమాసికంలో కూడా జీడీపీ 6.1 శాతానికి పడిపోయింది. అయితే ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో ఈ ప్రభావం కొంత తగ్గుముఖం పడుతుందని, జీడీపీ వృద్ధి రేటు పుంజుకోవచ్చని పలువురు భావించారు. కానీ అటు నోట్‌ బ్యాన్‌తో పాటు, ఇటు జీఎస్టీ ప్రభావం కూడా ఈ సారి జీడీపీ వృద్ధి రేటు పడి, మరింత కిందకి దిగజారింది. 

 

జూలై 1 నుంచి జీఎస్టీ అమలుకాకముందు కూడా ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం అనిశ్చితిగా, గందరగోళంగా ఉంది. ప్రీ-జీఎస్టీ సేల్‌తో రిటైలర్లు తమ ఇన్వెంటరీని పూర్తిగా ఖాళీ చేసుకోవాలని చూశారు. అంతేకాక జూలై 1 తర్వాత ధరలు ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందిన రిటైలర్లు, వచ్చే నెలకు ఎలాంటి స్టాక్‌ ఉండకూడదని ప్రీ-జీఎస్టీ సేల్‌, డిస్కౌంట్లతో స్టాక్‌ను విక్రయించేశారు. ఇది వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపింది. 2016 మార్చి నుంచి జీడీపీ వృద్ధి తగ్గుతూ వస్తోంది. దీంతో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ట్యాగ్‌ను కూడా భారత్‌ కోల్పోయింది.  
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top