జపాన్ లో ఐఎఫ్‌సీ ‘మసాలా’ బాండ్లు | ifc spicy brands in japan | Sakshi
Sakshi News home page

జపాన్ లో ఐఎఫ్‌సీ ‘మసాలా’ బాండ్లు

Mar 2 2016 1:58 AM | Updated on Sep 3 2017 6:46 PM

జపాన్ లో ఐఎఫ్‌సీ ‘మసాలా’ బాండ్లు

జపాన్ లో ఐఎఫ్‌సీ ‘మసాలా’ బాండ్లు

జపాన్ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.30 కోట్లు సమీకరించే దిశగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) తొలిసారిగా యురిదాషి మసాలా బాండ్లను (జపాన్ బాండ్లు) ప్రవేశ పెట్టింది.

ముంబై: జపాన్ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.30 కోట్లు సమీకరించే దిశగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) తొలిసారిగా యురిదాషి మసాలా బాండ్లను (జపాన్ బాండ్లు) ప్రవేశ పెట్టింది. ఈ నిధులను భారత్‌లో ప్రైవేట్ రంగ వృద్ధికి వినియోగించనున్నట్లు ఐఎఫ్‌సీ తెలిపింది. మసాలా బాండ్ల ద్వారా సంస్థ ఇప్పటిదాకా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ 1.7 బిలియన్ డాలర్లు సమీకరించింది. మసాలా బాండ్లంటే రూపీ డినామినేషన్లో విడుదల చేసేవి. సెటిల్‌మెంట్ మాత్రం ఏ దేశంలో జారీ చేస్తే ఆ కరెన్సీలో ఉంటుంది. తాజా జపాన్ (యురిదాషి) బాండ్ల కనీస విలువ రూ.లక్ష. జపాన్‌లోని సాధారణ పౌరుల నుంచి ఈ నిధులు సమీకరిస్తారు. 5.36 శాతం వడ్డీ ఉండే ఈ బాండ్లను ఈ ఏడాది మార్చి 30న జారీ చేస్తారు. మెచ్యూరిటీ తేదీ 2019 మార్చి 29.

Advertisement
 
Advertisement
Advertisement