కార్పొరేట్ పన్ను వ్యవస్థ ప్రక్షాళన: జైట్లీ | I want what everybody wants: FM Arun Jaitley on rate cut by RBI | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ పన్ను వ్యవస్థ ప్రక్షాళన: జైట్లీ

Mar 30 2016 1:39 AM | Updated on Sep 3 2017 8:49 PM

కార్పొరేట్ పన్ను వ్యవస్థ ప్రక్షాళన: జైట్లీ

కార్పొరేట్ పన్ను వ్యవస్థ ప్రక్షాళన: జైట్లీ

పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నాలుగు రోజుల ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభమైంది.

సిడ్నీ:  పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నాలుగు రోజుల ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభమైంది. భారత్ పన్ను వ్యవస్థ పట్ల అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లలో నెలకొన్న సందేహాలను తొలగించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడుల వృద్ధికి వ్యాపార పరిస్థితులను మెరుగుపరచడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల దిశగా భారత పన్నుల వ్యవస్థను సంస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. పన్నులకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న పలు సమస్యలను పరిష్కరించామని, ఇతర సమస్యల పరిష్కారంపైసైతం దృష్టి పెట్టామని అన్నారు. త్వరలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుకు పార్లమెంటు ఆమోదముద్ర పడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సిడ్నీ పర్యటనలో భాగంగా ఆయన భారత్ ఆర్థిక వ్యవస్థపై జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు.భారత్ భారీ పెట్టుబడులను కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement