అదిరిపోయే ఫీచర్లతో హానర్‌ 10 | Honor 10 With iPhone X-Like Notch Display Launched | Sakshi
Sakshi News home page

అదిరిపోయే ఫీచర్లతో హానర్‌ 10

Apr 19 2018 4:41 PM | Updated on Apr 19 2018 4:41 PM

Honor 10 With iPhone X-Like Notch Display Launched - Sakshi

హువావే సబ్‌ బ్రాండు హానర్‌ గురువారం కొత్త స్మార్ట్‌ఫోన్‌ హానర్‌ 10ను చైనాలో లాంచ్‌ చేసింది. ఐఫోన్‌ ఎక్స్‌ మాదిరి నాచ్‌ డిస్‌ప్లే డిజైన్‌తో హానర్‌ 10ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌గా కూడా కంపెనీ లాంచ్‌ చేయబోతోంది. బ్లాక్‌, గ్రే, మిరేజ్‌ బ్లూ, మిరేజ్‌ పర్‌పుల్‌ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ ధర 2,600 సీఎన్‌వై( సుమారు రూ.27,300), టాప్‌ వేరియంట్‌ ధర 2,800 సీఎన్‌వై(రూ.29,400)గా కంపెనీ పేర్కొంది. ఇటీవలే హువావే పీ20, పీ20 ప్రొ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. 

హానర్‌ 10 స్పెషిఫికేషన్లు...
5.84 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే
ఇన్‌-హౌజ్‌ కిరిన్‌ 970 ప్రాసెసర్‌
6జీబీ ర్యామ్‌
64జీబీ, 128జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లు
వెనుకవైపు 16 మెగాపిక్సెల్‌, 24 మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ సెన్సార్లు
ముందు వైపు 24 మెగాపిక్సెల్‌ కెమెరా
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్లు
 

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement