విజయా బ్యాంక్‌తో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఒప్పందం
Aug 04, 2018, 00:27 IST

న్యూఢిల్లీ: బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ విజయా బ్యాంక్ ద్వారా తన సేవలను మరింత విస్తరించనుంది. దేశవ్యాప్తంగా 2,129 శాఖలను కలిగిన విజయా బ్యాంక్ తమ ఖాతాదారులకు హెచ్‌డీఎఫ్‌సీ బీమా సేవలను అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు విజయా బ్యాంక్ సీఈఓ ఆర్‌ఏ శంకర నారాయణన్ చెప్పారు. దీర్ఘకాలంలో ఇరు సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
Advertisement
Advertisement
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి