మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.97,597కోట్లు | GST collection slips below Rs 1 lakh crore mark in March | Sakshi
Sakshi News home page

మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.97,597కోట్లు

Apr 2 2020 6:34 AM | Updated on Apr 2 2020 6:34 AM

GST collection slips below Rs 1 lakh crore mark in March - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్త లౌక్డౌన్‌ జీఎస్టీ వసూళ్లపై ప్రభావం చూపించింది. మార్చి నెలకు రూ.97,597 కోట్లు వసూలైంది. ఇందులో.. రూ.19,183 కోట్లు సీజీఎస్టీ కింద, రూ.25,601 కోట్లు ఎస్జీఎస్టీ కింద, రూ.44,508 కోట్లు ఐజీఎస్టీ కింద, రూ.8,306 కోట్లు సెస్సు రూపంలో వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2019 నవంబర్‌ నుంచి 2020 ఫిబ్రవరి వరకు ప్రతీ నెలా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లకు పైనే ఉండడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో 83 లక్షల జీఎస్టీ రిటర్నులు నమోదు కాగా, మార్చిలో 76.5 లక్షలకు తగ్గాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement