ఆర్థిక పునరుజ్జీవానికి మరో అస్త్రం!

Govt to Announce One More Economic Booster Dose This Week - Sakshi

మరో సారి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహక చర్యలు

ఈ వారంలోనే ప్రకటించే అవకాశం

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మళ్లీ జీవం పోసుకునేందుకు గాను కేంద్ర ప్రభుత్వం మరో విడత ప్రోత్సాహక చర్యల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. జూన్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. ప్రోత్సాహక చర్యల బ్లూప్రింట్‌ సిద్ధమైందని, కొన్ని రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటిస్తారని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. అంతకుమించి ఆయన వివరాలు తెలియజేయలేదు. ఇప్పటికే కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్‌ మూడు సార్లు ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించారు. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ప్రత్యేక నిధి, ఎగుమతుల రంగాలకు రూ.50,000 కోట్ల పన్ను రాయితీలు, ఆటోమొబైల్‌ రంగానికి ప్రోత్సాహకాలు ఇప్పటి వరకు ప్రకటించిన వాటిల్లో ఉన్నాయి. తొలిసారి ఆగస్ట్‌ 23న ప్రకటనలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై పెంచిన సర్‌చార్జీని ప్రభుత్వం ఉపసంహరించుకుంది కూడా.

అంతకుముందు బడ్జెట్‌లో ఈ ప్రకటన చేసిన నాటి నుంచి ఎఫ్‌పీఐలు అదే పనిగా పెద్ద ఎత్తున మార్కెట్లో విక్రయాలు చేస్తుండడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కాగా, ప్రభుత్వం నుంచి మరిన్ని చర్యలు ఉంటాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ సైతం ఇటీవలే అభిప్రాయపడ్డారు. ‘‘సరైన చర్యలు తీసుకుంటే కచి్చతంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రభుత్వం వేగంగా స్పందిస్తుండడం సానుకూలం. ఆరి్థక పరిస్థితులను చక్కదిద్దే విషయంలో ప్రభుత్వం నుంచి ఇవే చివరి చర్యలని   భావించడం లేదు. ఇవి కొనసాగుతూనే ఉంటాయి. తప్పకుండా సవాళ్లను వారు పరిష్కరిస్తారు’’ అని దాస్‌ ఇటీవలే పేర్కొన్నారు. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆరి్థక వ్యవస్థగా రానున్న ఐదేళ్లలో అవతరించేందుకు, ప్రభుత్వరంగ బ్యాంకులను మరింత బలోపేతం చేయాలని భావించిన సర్కారు భారీ విలీనాల దిశగా కూడా అడుగు వేసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top