ఒక స్మార్ట్‌ఫోన్‌ రీఫండ్‌ అడిగితే..10 ఫోన్లు

Google Gives Pixel 3 Owner 10 Replacement Phones Instead of Refund Report - Sakshi

గూగుల్‌ పిక్సెల్‌​ 3  కొన్న చీటోకి  వింత అనుభవం

రూ. 56,898కి బదులుగా రూ.6 లక్షల విలువైన స్మార్ట్‌ఫోన్లు 

గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసిన ఒక వినియోగదారుడికి  అరుదైన  అనుభవం ఎదురైంది. రెడిట్‌ ప్రచురించిన కథనం ప్రకారం  చీటో అనే వినియోగదారుడు గూగుల్‌ పిక్సెల్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే  అది సరిగ్గా పనిచేయకపోవడంతో, దాని డబ్బులు వాపసు ఇవ్వాలని కోరుతూ ( రూ.56,898) గూగుల్‌  కంపెనీని కోరాడు. అయితే దీనికి బదులుగా కేవలం రూ.5500  మాత్రమే రీఫండ్‌ చేసింది.  

ఇక్కడ ఇంకోట్విస్ట్‌ ఏంటంటే చీటో కి జాక్‌ పాట్‌ లాంటి ఆఫర్‌ వచ్చింది. నగదు రీఫండ్‌కు బదులుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 పిక్సెల్‌ 3 స్మార్ట్‌ఫోన్ల పార్సిల్‌ పలకరించింది.  దాదాపు 6 లక్షల రూపాయల విలువ చేసే  పిక్సెల్‌  స్మార్ట్‌ఫోన్లు చూసి చీటో ఖంగుతిన్నాడు.  అయితే తన సొమ్ము మొత్తం రీఫండ్‌​ వచ్చే వరకు... ఈ స్మార్ట్‌ఫోన్లను కంపెనీకి వెనక్కి ఇచ్చేది లేదని ప్రకటించాడు.  

అయితే తాజా సమాచారం ప్రకారం గూగుల్‌ మొత్తం సొమ్మును చీటోకి రీఫండ్‌ చేసిందట. దీంతో చీటో మొత్తం 10 ఫోన్లను కంపెనీకి రీసెండ్‌ చేసే ప్రయత్నంలో ఉన్నాడు.  కొసమెరుపు ఏంటంటే  చీటో మరో పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్‌ చేయడంతో పదిఫోన్లు ఆర్డర్‌ చేసినట్టుగా భావించిందట కంపెనీ. అయితే పొరపాటుగా పంపించిన 10 ఫోన్లను రీఫండ్‌ చేయమని కంపెనీ అడిగే పరిస్థితిలో లేనప్పటికీ.. నిజాయితీగా  తనకు  వచ్చిన పార్సిల్‌ను  తిరిగి వెనక్కి ఇచ్చేందుకు  సిద్దపడ్డాడు చీటో.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top