మోదీని త్వరలో కలుస్తా గూగుల్ చీఫ్ సుందర్.. | Google chief Sundar Modi to meet soon | Sakshi
Sakshi News home page

మోదీని త్వరలో కలుస్తా గూగుల్ చీఫ్ సుందర్..

Aug 12 2015 11:46 PM | Updated on Aug 15 2018 6:34 PM

మోదీని త్వరలో కలుస్తా గూగుల్ చీఫ్ సుందర్.. - Sakshi

మోదీని త్వరలో కలుస్తా గూగుల్ చీఫ్ సుందర్..

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సీఈవోగా నియమితులైన సుందర్ పిచాయ్ త్వరలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే

న్యూయార్క్ : టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సీఈవోగా నియమితులైన సుందర్ పిచాయ్ త్వరలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం లభించగలదని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్వీటర్ ద్వారా తనను అభినందించిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ట్వీటర్‌లో మోదీ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ..  ‘శుభాకాంక్షలకు ధన్యవాదాలు. త్వరలోనే మిమ్మల్ని కలిసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా’ అంటూ సుందర్ పోస్ట్ చేశారు.

ప్రధాని మోదీ వచ్చే నెల సిలికాన్ వేలీలో పర్యటించనున్న సందర్భంగా పలువురు టెక్నాలజీ దిగ్గజాలను కలవనున్నారు. ఇందులో భాగంగా సుందర్ కూడా ఆయనతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గూగుల్ సీఈవోగా పదోన్నతి పొందిన సుందర్‌ను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మొదలుకుని యాపిల్ సీఈవో టిమ్ కుక్ దాకా అభినందించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement