కార్డుతో చెల్లింపులపై సర్చార్జీలు రద్దు | Good news! Now, no service charge, surcharge and convenience fee on digital payment | Sakshi
Sakshi News home page

కార్డుతో చెల్లింపులపై సర్చార్జీలు రద్దు

Feb 24 2016 11:57 PM | Updated on Sep 28 2018 3:31 PM

కార్డుతో చెల్లింపులపై సర్చార్జీలు రద్దు - Sakshi

కార్డుతో చెల్లింపులపై సర్చార్జీలు రద్దు

క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారాను, ఇంటర్నెట్ ద్వారాను జరిపే చెల్లింపులపై ఇకపై సర్‌చార్జీలు, సర్వీస్ చార్జీలు, కన్వీనియన్స్ ఫీజుల బాదరబందీ తొలగిపోనుంది.

డిజిటల్ పేమెంట్లకు ఊతమిచ్చే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారాను, ఇంటర్నెట్ ద్వారాను జరిపే చెల్లింపులపై ఇకపై సర్‌చార్జీలు, సర్వీస్ చార్జీలు, కన్వీనియన్స్ ఫీజుల బాదరబందీ తొలగిపోనుంది. అలాగే నిర్దిష్ట పరిమితికి మించిన మొత్తాలను కార్డు లేదా డిజిటల్ మాధ్యమంలోనే చెల్లించడం తప్పనిసరి కానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. ఆర్థిక లావాదేవీల్లో నగదు చెల్లింపుల ప్రమేయాన్ని తగ్గించేందుకు, డిజిటల్ కార్డుల ద్వారా లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. పన్నుల ఎగవేత ఉదంతాలను తగ్గిం చేందుకు, ఆదాయాలు.. చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం నగదురహిత విధానానికి మళ్లేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. మరోవైపు, 2016- 17 సీజన్‌కు సంబంధించి జనుము మద్దతు ధరను 18.5 శాతం పెంచి క్వింటాలుకు రూ. 3,200కి చేర్చే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసిం ది. ప్రస్తుతం ఇది రూ. 2,700గా ఉంది. వాస్తవానికి దీన్ని రూ. 3,650కి పెంచాలని జౌళి శాఖ కోరింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement