ఎఫ్‌పీఐలను మెప్పిస్తున్న ఐటీ షేర్లు

FPIs Hike Stake In TCS In June 2020 Quarter; Cut Holding In HCL Tech, Wipro - Sakshi

క్యూ1లో ఐటీ షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి

దేశీయ ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ రంగ షేర్లపై విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) సానుకూల వైఖరినే కలిగి ఉన్నారు. ఎఫ్‌పీఐలు ఆర్థిక సం‍వత్సరపు తొలి త్రైమాసికంలో జరిపిన క్రయ, విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతం అవుతుంది. ఈ క్యూ1లో వారు టీసీఎస్‌, ఎల్‌అండ్‌ టెక్నాలజీస్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ షేర్లకు కొనుగోలు చేశారు. హెచ్‌సీఎల్‌, విప్రో కంపెనీల షేర్లను విక్రయించారు. 

అలాగే మైండ్‌ట్రీ, పర్‌సిస్టెంట్‌ సిస్టమ్స్‌, ఈ కార్లెక్స్‌ సర్వీసెస్‌, సోనాటా సాఫ్ట్‌వేర్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ కంపెనీల్లో 2శాతం వరకు తమ వాటాలను తగ్గించుకున్నాయి. ఇన్ఫోసిస్‌కు షేర్ల విషయంలో ఎఫ్‌పీఐల వైఖరీ ఎలా ఉందో అనే విషయం నేడు(క్యూ1 ఫలితాలు విడుదల)తెలిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్‌ 6.7శాతం లాభపడింది. అయితే బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ మాత్రం 10.9శాతం నష్టపోయింది.

ఇదే క్యూ1లో టీసీఎస్‌లో ఇన్వెస్టర్లు 0.11శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఫలితంగా కంపెనీలో ఎఫ్‌పీఐల మొత్తం వాటా 15.85శాతానికి చేరుకుంది. ఇదే తొలి త్రైమాసికంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ టీసీఎస్‌లో తమ వాటాను 2.55శాతం నుంచి 2.51శాతానికి తగ్గించుకున్నారు.  ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ రంగాల్లో ఎఫ్‌పీఐల వాటా జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. 

లాక్‌డౌన్‌ విధింపుతో వ్యవస్థ అంతా స్తంభించుకుపోయింది. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా టెక్నాలజీ రంగం మిగతా అన్ని రంగాల కంటే ఎక్కువ లాభపడింది. ఈ అంశం ఇన్వెస్టర్లను ఆకర్షించగలిగింది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌, నెట్‌వర్కింగ్‌లో అవకాశాలు కొంతమందికి కొత్త అవకాశాలను అందించాయి. ఇప్పటివరకు ఐటీ షేర్లు బాగుందని ఇక ముందు ఈ రంగ షేర్ల ఎంపిక పట్ల జాగ్రత అవసరం. యూఎస్‌ అమెరికా ఆర్థిక వ్యవస్థలు రికవరీకి మరింత సమయం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇది ఐటీ కంపెనీల ఖర్చు, డిమాండ్‌ ప్రభావితం చేయగలవు.’’ అని ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ ఫౌండ్‌ జి జొక్కాలింగం తెలిపారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top