భారీగా తగ్గిన ఎవరెడీ ఇండస్ట్రీస్‌ నికర లాభం  

Eveready Industries posts multifold dip in Q3 net at Rs 19.71 lakh - Sakshi

న్యూఢిల్లీ: బ్యాటరీలు, ఫ్లాష్‌లైట్లు తయారు చేసే ఎవరెడీ ఇండస్ట్రీస్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో భారీగా తగ్గింది. గత క్యూ3లో రూ.21 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.18 లక్షలకు తగ్గిందని ఎవరెడీ ఇండస్ట్రీస్‌ తెలిపింది.   చెన్నైలోని తిరువొత్తియూర్‌  ప్లాంట్‌లో కార్మికుల స్వచ్చంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌) వ్యయాలు  రూ.23 కోట్లుగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. ఈ క్యూ3లోనే ఈ వీఆర్‌ఎస్‌ ప్రక్రియ పూర్తయిందని, ఈ భూమిని అళ్వార్‌పేట్‌ ప్రొపర్టీస్‌కు రూ.100 కోట్లకు విక్రయించడానికి గత డిసెంబర్‌లోనే ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది.

మొత్తం ఆదాయం రూ.374 కోట్ల నుంచి రూ.388 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ క్యూ3లో బ్యాటరీ అమ్మకాలు 6 శాతం పెరిగాయని తెలిపింది. లైటింగ్‌ సెగ్మెంట్‌ టర్నోవర్‌ 11 శాతం తగ్గి రూ.88 కోట్లకు చేరిందని వివరించింది.   ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎవరెడీ ఇండస్ట్రీస్‌ షేర్‌ 0.17 శాతం తగ్గి రూ.202 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top