డ్రోన్ల ఫ్లయింగ్‌ శిక్షణ

Drones flying training in hyderabad - Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ఐటీ, ఇంజనీరింగ్‌ సేవల కంపెనీ సైయంట్‌ ఆధ్వర్యంలో డ్రోన్ల ఫ్లయింగ్‌ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ (టీఎస్‌ఏఏ)లతో ఒప్పందం చేసుకుంది. ఇది తెలంగాణలో తొలి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) సర్టిఫైడ్‌ ట్రయినింగ్‌ అని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ.. ఎంవోయూలో భాగంగా సైయంట్‌ శిక్షణ ఉపకరణాలను, టీఎస్‌ఏఏ మౌలిక వసతులు, నిర్వహణ బాధ్యతలను చేపడుతుందని తెలిపారు. ఐదు రోజుల శిక్షణ అనంతరం డీజీసీఏ రిమోట్‌ పైలెట్‌ లైసెన్స్‌ సర్టిఫికెట్‌ అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఏఏ సీఈఓ జీబీ రెడ్డి, సైయంట్‌ ఎండీ అండ్‌ సీఈఓ కృష్ణా బోడనపు పాల్గొన్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top