ముడిచమురు ధరల మంటే రేట్లకోతకు అడ్డేసింది  | Sakshi
Sakshi News home page

ముడిచమురు ధరల మంటే రేట్లకోతకు అడ్డేసింది 

Published Thu, Dec 21 2017 12:23 AM

The details of the RBI MPs meeting - Sakshi

ముంబై: ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ నెల మొదటి వారం నాటి సమావేశ వివరాలు బయటకు వచ్చాయి. ఈ భేటీలో కీలక రేట్లలో ఎటువంటి మార్పులు చేయకూడదని ఎంపీసీ నిర్ణయం తీసుకోగా, దీనికి పెరుగుతున్న ముడిచమురు ధరలే కారణమని తెలిసింది. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ ప్రపంచ చమురు ధరలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు ద్రవ్యపరమైన, ఇతర అంశాల పరంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులపైనా పటేల్‌ ఆందోళన వ్యక్తీకరించారు.

ఇతర సభ్యుల్లో డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైకేల్‌ దేబబ్రత పాత్ర పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన ద్రవ్యోల్బణాన్ని లేవనెత్తారు. ఇందుకు సంబంధించి ఈ నెల 5, 6 సమావేశ వివరాలను ఆర్‌బీఐ వెల్లడించింది. ఆరుగురు సభ్యుల ఎంపీసీలో రవీంద్ర ఢోలాకియా ఒక్కరే రేట్లను 0.25 శాతం తగ్గించేందుకు మొగ్గుచూపగా, మిగిలిన వారు ఏకాంగీకారంతో యథాతథ స్థితికే ఓటేశారు.    

Advertisement
 
Advertisement
 
Advertisement