వచ్చే ఏడాది అర శాతం రేటు కోత!: కొటక్ | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది అర శాతం రేటు కోత!: కొటక్

Published Fri, Dec 9 2016 1:22 AM

వచ్చే ఏడాది అర శాతం రేటు కోత!: కొటక్

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వచ్చే ఏడాది రెపో రేటును (బ్యాంకులకు  తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.25 శాతం) 25 నుంచి 50 బేసిస్ పారుుంట్ల వరకూ (100 బేసిస్ పారుుంట్లు ఒక శాతం) తగ్గించే అవకాశం ఉందని కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. జనవరి-మార్చి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం పెరగవచ్చన్న అంచనాల ప్రధాన కారణంగా బుధవారం నాటి ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) ఆధారిత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.4% ఉంటుందని కొటక్ అంచనావేసింది. జనవరి-మార్చిలో ద్రవ్యోల్బణం లక్ష్యం మేరకు 5%గా ఉంటుందని పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement