కొబ్బరినూనె ఓ షాకింగ్‌ రిపోర్ట్‌!

Coconut oil is pure poison that increases cholesterol, says Harvard professor - Sakshi

కొబ్బరినూనె తాగితే  అధిక బరువునుంచి విముక్తి కలుగుతుందని, మధుమేహం తగ్గుతుందని, థైరాయిడ్ సమస్య పోతుందనే మాట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే తాజాగా ఓ షాకింగ్‌  రిపోర్ట్‌  వెలుగులోకి వచ్చింది.  కొవ్వు తగ్గకపోగా  కొబ్బరి నూనె సేవిస్త కొలెస్ట్రాల్‌  స్థాయిపెరుగుతుందని తాజా రిపోర్ట్‌ నివేదించింది. 

కొబ్బరినూనె శుద్ధవిషమని హార్వర్డ్ ప్రొఫెసర్, ఎపిడమాలజిస్ట్‌ కారిన్ మిషెల్స్ హెచ్చరిస్తున్నారు.  అతి చెత్త ఆహారాలలో కొబ్బరి నూనె ఒకటి అని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆప్ ఫ్రీబుర్గ్‌లో ఇటీవల ఆమె కోకోనట్ ఆయిల్ ఇతర పోషక లోపాలు అనే శీర్షికతో ప్రసంగం చేశారు. కొబ్బరినూనెలో ఉండే గాఢమైన కొవ్వు ప్రమాదకరమైన ఎల్‌డీఎల్ పరిణామాన్ని పెంచుతుందని ప్రొఫెసర్ మిషెల్ హెచ్చరించారు.

అయితే సమతుల ఆహారంలో కొబ్బరినూనెను కొద్ది మోతాదులో తీసుకుంటే ఫరవాలేదని, శ్రుతిమించితే హృద్రోగాలు తప్పవని  బ్రిటీష్‌ నూట్రిషన్‌ ఫౌండేషన్ వెల్లడించింది.. కొబ్బరినూనె తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన మేలు ఏమిటో ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదని  తెలిపింది.  వెన్నతో పోలిస్తే కొబ్బరినూనెలో  మూడురెట్లు , 86శాతం ఎక్కువ ఫాట్‌ వుటుందని   బ్రిటీష్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ సీనియర్‌ డైటీషన్‌    విక్టోరియా టేలర్‌  చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top