సీసీఎల్ ప్రోడక్ట్్స లాభం రూ.37 కోట్లు | CCL Products: Q4 earnings expected to increase | Sakshi
Sakshi News home page

సీసీఎల్ ప్రోడక్ట్్స లాభం రూ.37 కోట్లు

May 3 2016 1:57 AM | Updated on Sep 3 2017 11:16 PM

సీసీఎల్ ప్రోడక్ట్్స లాభం రూ.37 కోట్లు

సీసీఎల్ ప్రోడక్ట్్స లాభం రూ.37 కోట్లు

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సీసీఎల్ ప్రోడక్ట్స్ నికర లాభం రూ. 37 కోట్లుగా (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) నమోదైంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సీసీఎల్ ప్రోడక్ట్స్ నికర లాభం రూ. 37 కోట్లుగా (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 22 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 216 కోట్ల నుంచి రూ. 264 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం రూ. 880 కోట్ల నుంచి రూ. 932 కోట్లకు, లాభం రూ. 94 కోట్ల నుంచి రూ. 122 కోట్లకు పెరిగింది. అటు రూ. 2 ముఖ విలువ గల షేరు  ఒక్కింటికి రూ. 1 చొప్పున తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది. ఇది మధ్యంతర డివిడెండు రూ. 1.50కు అదనంగా ఉంటుందని వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement