పన్ను చెల్లింపుదారులకు మరో అవకాశం

 CBDT extends till Jan 31 deadline for compounding of IT offences - Sakshi

జనవరి 31వరకు గడుపు పెంచిన సీబీడీటీ

అంతకుముందు గడువు 2019, డిసెంబర్ 31

సాక్షి, న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆదాయపు పన్ను నేరాల కాంపౌండింగ్‌ కు కల్పించిన ప్రత్యేక అవకాశాన్ని మరో నెలపాటు పొడిగిస్తూ  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ (సీబీడీటీ) ప్రకటించింది. డిసెంబరు 31తో ముగిసిన గడువును జనవరి 31 వరకు  పెంచుతున్నట్టు సీబీడీటీ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. ఆదాయపు పన్ను నేరాల సమ్మేళనం కోసం దరఖాస్తు చేసుకోవడానికి పన్ను చెల్లింపుదారులు సదుపాయాన్ని పొందటానికి చివరి తేదీ జనవరి 31 వరకు సిబిడిటి పొడిగించినట్లు శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులలో తెలిపింది. ఐపీఏఐ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా)తో  సహా  మిగిలిన  క్షేత్ర నిర్మాణాల నుంచి  వచ్చిన అభ్యర్ధనల మేరకు  ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ తుది అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది.

కాగా న్యాయబద్ధమైన కేసుల్లో పన్ను చెల్లింపుదారుల ఇక్కట్లను తప్పించేందుకు, ప్రాసిక్యూషన్ కేసుల పెండింగ్‌ను తగ్గించేందుకు ‘‘వన్-టైమ్" అవకాశాన్నిగత ఏడాది సెప్టెంబరులో ప్రకటించింది. డిసెంబరు 31వరకు అవకాశాన్నికల్పించింది. పన్ను నేరాలు లేదా పన్ను ఎగవేతకు పాల్పడిన వారు పన్ను బకాయిలు, సర్‌చార్జీలు చెల్లించేందుకు అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంతో వారిపై ప్రాసిక్యూషన్‌ దాఖలు చేయకపోవడాన్నే కాంపౌండింగ్‌గా వ్యవహరిస్తారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top