appకీ కహానీ...గెట్ ప్రోయాక్టివ్ | Burn calories to lower health insurance cost | Sakshi
Sakshi News home page

appకీ కహానీ...గెట్ ప్రోయాక్టివ్

Oct 10 2016 12:51 AM | Updated on Sep 4 2017 4:48 PM

appకీ కహానీ...గెట్ ప్రోయాక్టివ్

appకీ కహానీ...గెట్ ప్రోయాక్టివ్

పాలసీదారులు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తూ..

పాలసీదారులు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తూ.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు తగ్గించుకునేలా ప్రోత్సహించడానికి ఆరోగ్య బీమా సంస్థ సిగ్నా టీటీకే తాజాగా ‘గెట్ ప్రోయాక్టివ్’ పేరిట ఫిట్‌నెస్ ట్రాకింగ్ యాప్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేస్తుంది. ‘గెట్ ప్రోయాక్టివ్’ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 ప్రత్యేకతలు
నిర్దిష్ట వేరబుల్ పరికరాలకు గెట్ ప్రోయాక్టివ్ ను అనుసంధానించి సిగ్నా టీటీకే పాలసీదారులు వ్యాయామ సరళిని ట్రాక్ చేసుకోవచ్చు.

అదే సమయంలో ఒక్కో యాక్టివిటీకి పాయిం ట్లూ పొందొచ్చు. వాకింగ్ చేస్తే వేల అడుగులకు 0.25 పాయింటు, 10 వేల అడుగులకు 1 పాయిం టు చొప్పున రివార్డు పాయింట్లు ఉంటాయి.

సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వాటికి మరిన్ని పాయింట్లు లభిస్తాయి.

ఒక్కో హెల్తీ రివార్డ్ పాయింటు విలువ రూ. 1కి సమానం.

వీటిని రెన్యువల్ ప్రీమియంలో డిస్కౌంటుకు లేదా ఇతరత్రా హెల్త్ మెయింటెనెన్స్ ప్రయోజనాలు క్లెయిమ్ చేయడానికి వాడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement