బీఎస్‌ఎన్‌ఎల్‌ వీఆర్‌ఎస్‌కు భారీ స్పందన

BSNL gets 50000 MTNL 3000 application for VRS  - Sakshi

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 50వేలం మంది

ఎంటీఎన్‌ఎల్‌ నుంచి  3 వేల మంది దరఖాస్తు

నవంబరు 4  నుంచి  డిసెంబరు 3  వరకు  ఈ స్కీం అందుబాటులో​

సాక్షి, ముంబై:  ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లోని వీఆర్‌ఎస్‌  పథకానికి భారీ స్పందన  లభిస్తోంది. స్వచ్చంద పదవి విరమణ (వీఆర్‌ ఎస్‌) స్కీంనకు  ఉద్యోగులనుంచి ఊహించని  స్పందన  లభించిందని కేంద్రం శుక్రవారం తెలిపింది. కేవలం 4 రోజుల్లో  బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 50,000 దరఖాస్తులు రాగా, ఎమ్‌టిఎన్‌ఎల్ 3వేల మంది ఉద్యోగులను వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేశారని తెలిపింది. ఎంటీటిఎన్‌ఎల్‌ నుంచి 15 వేల మందిలో ఇప్పటికే 3వేల మంది ముందుకొచ్చారన్నారు. అలాగే మొత్తం వీఆర్‌ఎస్ కోసం 83వేల మంది టార్గెట్‌ అని  టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాష్ చెప్పారు. కేంద్రం ప్రకటించిన వీఆర్‌ఎస్‌ చాలా బాగా ఆలోచించిన పథకమనీ అందుకే ఉద్యోగుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.

బీఎస్ఎన్ఎల్ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం - 2019 ప్రకారం, బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన రెగ్యులర్‌, పర్మినెంట్‌ ఉద్యోగులు, డిప్యూ టేషన్‌పై ఇతర సంస్థల్లోకి పంపిన వారు, 50 ఏళ్ల వయసు దాటిన వారు ఈ స్కీంకు అర్హులు. ఎంటీఎన్‌ఎల్‌ ఉద్యోగులకు  కూడా 3వీఆర్‌ఎస్‌ స్కీంను అం దుబాటులోకి తెచ్చింది. ఈ స్కీం నవంబర్‌ 4 నుంచి డిసెంబర్‌ 3 వరకు కొనసాగుతుంది. అర్హులైన ఉద్యోగులకు సర్వీసు పూర్తిచేసిన కాలానికి ఏడాదికి 35 రోజుల వేతనం అలాగే మిగిలిన సర్వీసు కాలానికి ప్రతి ఏడాదికి 25 రోజుల వేత నాన్ని లెక్క గట్టి చెల్లిస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top