స్టార్టప్‌లో బిన్నీ బన్సల్‌ భారీ పెట్టుబడులు | Binny Bansal Huge Investments On start up Company | Sakshi
Sakshi News home page

స్టార్టప్‌లో బిన్నీ బన్సల్‌ భారీ పెట్టుబడులు

Oct 25 2019 9:04 PM | Updated on Oct 25 2019 9:23 PM

Binny Bansal Huge Investments On start up Company - Sakshi

బెంగుళూరు: ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు, బిన్నీ బన్సల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం స్టార్ట్‌ప్‌ సంస్థ మొబీకాన్‌ ఆహారం, రెస్టారెంట్ల పరిశ్రమలను టెక్నాలజీతో అనుసంధానం చేయడంతో బన్సల్‌ సైతం మోబీకాన్‌లో12.5మిలీయన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని నిశ్చయించుకున్నారు. బన్నీ సింగపూర్‌కు వెళ్లిన తర్వాత మొదటి సారి భారత్‌లో పెట్టుబడులు పెడుతుండడం విశేషం. కాగా, మొబీకాన్‌ వ్యవస్థాపకుడు సమీర్‌ ఖాదేపాన్‌ కూడా సింగపూర్‌కు చెందిన వ్యక్తి కావడం గమనార్హం.

బన్నీ మొదటి సారిగా స్టార్ట్‌ప్‌ కంపెనీలలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే బన్సల్‌ స్పందిస్తూ రెస్టారెంట్ల వ్యాపారం భారత్‌లో క్రమక్రమంగా పుంజుకుంటుందని, భవిష్యత్తులో ఆస్ట్రేలియాలో సైతం విస్తరిస్తామని అన్నారు. ఇటీవల కాలంలో మొబీకాన్‌ 25మిలియన్ల పెట్టుబడులను ఆకర్షించిందని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా జంగల్‌ వెంచర్స్‌, స్ప్రింగ్‌ లాంటి సంస్థలలో భారీగా పెట్టుబడులు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement