భవిష్యత్తులో మరిన్నిఉద్యోగాలు: పేమెంట్స్‌ బ్యాంకు

Arun Jaitley launches Paytm Payments Bank - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఈ-వాలెట్ దిగ్గజం పేటీఎం తన  చెల్లింపుల సంస్థ  పేమెంట్స్ బ్యాంకు  సేవలను అధికారికంగా  ప్రారంభించింది.   ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌  జైట్లీ  అధికారికంగా  మంగళవారం ఈ బ్యాంక్‌ను లాంచ్‌ చేశారు.  ఈ ఏడాది జనవరిలో  లాంచ్‌ చేసిన   పేమెంట్స్‌ బ్యాంక్‌ సేవలను కేంద్ర ఆర్థికమంత్రి చేతులమీదుగా అధికారికంగా సేవలను ప్రారంభించింది.  

ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ  ఇటీవల అమల్లోకి వచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల నగదు లావాదేవీల ప్రాబల్యం మారుతోందని  అరుణ్‌ జైట్లీ పేర్కొన​ఆరు.  కొత్త చెల్లింపుల బ్యాంకు లాంచింగ్‌ ద్వారా  చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించబడిందన్నారు.  దేశంలో ఆర్థికవ్యవస్థ చేరికలను మరింత విస్తరించిందని తెలిపారు.  దాదాపు ప్రతిరోజు ఒకకొత్త ఆవిష్కరణతో  ఆర్ధికవ్యవస్థ మరింత సాధారణీకరణకు దారితీస్తుందన్నారు.  కేవలం నగదు ద్వారా లావాదేవీలు జరిపే అలవాటు క్రమంగా  మారిపోతోందని జైట్లీ తెలిపారు.  భారత దేశం ఆర్థికవిప్లవం శిఖర భాగాన ఉందని పే టీఎం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. ఫిజికల్‌  ఏటీఎంల స్థాపనకు పేటీఎం  పనిచేస్తోందన్నారు.  ఆర్థిక సేవల విప్లవంలో పేటీ ఎం భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందన్నారు. అలాగే భవిష్యత్తులోదేశంలో  అనేక ఉద్యోగాలు లభించనున్నాయనీ,  లాంగ్‌ రన్‌లో భారీ ఉద్యోగాల కల్పనకు తాము కృషి  చేస్తామన్నారు. 

కాగా పేటీఎం  పేమెంట్స్‌ బ్యాంక్‌ద్వారా ఆన్‌లైన్‌  లావాదేవీలు ఉచితం.  ఉచితంగా డిజిటల్ రుపే  డెబిట్ కార్డును అందిస్తుంది.   పొదుపు ఖాతాలపై 4-7 శాతం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 7శాతం దాకా  వడ్డీరేటును అందిస్తోంది. 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని ప్రణాళికలు వేస్తున్న  పేటీఎం పేమెంట్స్‌..వినియోగదారులు బ్యాంక్ ఖాతాలను తెరిచేందుకు వీలుగా దేశమంతటా కేవైసీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top