వచ్చే దీపావళి పండగ సందర్భంగా ఎయిర్ ఏషియా విమాన సంస్థ టిక్కెట్ల ధరలపై ఆఫర్ ప్రకటించింది.
దీపావళి పండగ సందర్భంగా ఎయిర్ ఏషియా విమాన సంస్థ టికెట్ల ధరలపై ఆఫర్ ప్రకటించింది. ప్రయాణికులకు టికెట్ ధరలపై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ఆదివారం ఎయిర్ ఏషియా యాజమాన్యం వెల్లడించింది.
జూలై 18 నుంచి నవంబర్ 24 మధ్యకాలంలో ప్రయాణించేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రమోషన్ కాంపెయిన్ ఈ నెల 17 వరకు నిర్వహిస్తామని తెలిపారు. భారత్, మలేసియా, థాయ్లాండ్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ విమాన సర్వీసులలో డిస్కౌంట్ ధరలు వర్తిస్తాయని ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో అమర్ అబ్రోల్ చెప్పారు.