ప్రతికూలంలోనూ అమ్మకాలు! | 2,250 flats for sale in joining the Rainbow vistas | Sakshi
Sakshi News home page

ప్రతికూలంలోనూ అమ్మకాలు!

Aug 29 2015 12:16 AM | Updated on Sep 3 2017 8:18 AM

స్థిరాస్తి రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలోనూ అమ్మకాల వేగం ఏమాత్రం తగ్గలేదని

 2,250 ఫ్లాట్ల అమ్మకానికి చేరిన రెయిన్‌బో విస్తాస్
 
 సాక్షి, హైదరాబాద్ : స్థిరాస్తి రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలోనూ అమ్మకాల వేగం ఏమాత్రం తగ్గలేదని సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రై.లి. ఎండీ వేణు వినోద్ చెప్పారు. ఇచ్చిన గడువులోగా నిర్మాణం పూర్తి చేయడం, నిర్మాణంలో నాణ్యత, వేగం వంటి వి ఇందుకు కారణమన్నారు. ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ నుంచి మూసాపేటకు వెళ్లే దారిలో 68 ఎకరాల్లో నిర్మిస్తున్న రెయిన్‌బో విస్తాస్ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్ల అమ్మకాలు 2,250 మైలురాయిని చేరినట్లు తెలిపారు.

►68 ఎకరాల్లో నిర్మిస్తున్న రెయిన్‌బో విస్తాస్ ప్రాజెక్ట్‌ను రెండు సహజ సిద్ధమైన చెరువులతో.. మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నాం. ఫేజ్-1లో 7 ఎకరాల్లో 448 ఫ్లాట్లను పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇంటి తాళాలందించాం కూడా. ఫేజ్-2లో 22 ఎకరాల్లో  రాక్ గార్డెన్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో మొత్తం 20 అంతస్తుల్లో 2,250 ఫ్లాట్లను నిర్మిస్తున్నాం. 7 ఎకరాల్లో సెంట్రల్ పార్క్, లక్ష చ.అ.ల్లో క్లబ్ హౌజ్ ఉంటాయి. చ.అ. ధర రూ.4,400గా నిర్ణయించాం.

►మివాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండటం దీని ప్రత్యేకత. దీంతో ఇతర ప్రాజెక్ట్‌తో పోలిస్తే రెయిన్‌బో విస్తాస్ 9 నెలల ముందుగా పూర్తవుతుంది. అంతేకాదు కార్పెట్ ఏరియా కూడా ఎక్కువొస్తుంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement